హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జీవో నంబర్ 97లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం విద్యా సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి సమాధానమిచ్చారు. రూ.8 వేల కోట్లతో పాలిటెక్నిక్ విద్య ను ఆధునీకరించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.
పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ అవుతుందన్న అపోహాలున్నాయన్నారు. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, ఏఐసీటీఈ సర్టిఫికెట్ విద్యార్థులకు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీ కొనసాగుతుందని, కొత్త కోర్సులపై అధ్యాపకులకు శిక్షణ కల్పిస్తామని వివరించారు.