మోర్తాడ్/భీమ్‌గల్/వేల్పూర్/కమ్మర్పల్లి, సెప్టెంబర్ 17: నిజామాబాద్ బాల్కొం డ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. వేముల వెంటే ఉంటామంటూ వివిధ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. మోర్తాడ్ మండలం ధర్మోరాలో ఆదివారం ముదిరాజ్, ఆడెపు సంఘాల సభ్యులు మంత్రి వేములకు మద్దతుగా తీర్మానం చేసి, ఆ ప్రతిని ఎంపీపీ శివలింగుశ్రీనివాస్కు అందజేశారు.
భీమ్‌గల్ మం డలం జాగిర్యాల్‌కు చెందిన మాదిగ దండోరా సంఘానికి చెందిన 48 మంది, మెండోరాకు చెందిన వడ్డెర సంఘం సభ్యులు 47 మంది, మున్నూరు కాపు సం ఘం సభ్యులు 25 మంది, పల్లికొండ మున్నూరుకాపు సంఘం సభ్యులు 45 మంది, బాచన్పల్లికి చెందిన గంగపుత్ర సంఘాల సభ్యులు 50 మంది కారు గుర్తుకు ఓటు వేసి వేములను గెలిపించుకుంటామని ప్రకటించారు. వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో పద్మశాలీ సంఘ సభ్యులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకొని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రతిని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా వేములకు మద్దతు ప్రకటించారు.