అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలు
24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.
- రుణమాఫీని ఆపిందే కాంగ్రెస్
- ఆ పార్టీ మాటలను నమ్మొద్దు
- 3 తర్వాత రుణమాఫీ షురూ
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- బాల్కొండలో ఎన్నికల ప్రచారం
బాల్కొండ, నవంబర్ 26: 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌తో పోటీ పడ్డట్టు 3 గంటల కరెంటే అంటున్నాడని గుర్తు చేశారు. మొత్తానికి 24 గంటల కరెంట్‌ను పోటీ పడి ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ అధిష్ఠానం కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ సురేశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుణమాఫీని ఆపింది కాంగ్రెస్ పార్టీయే అని.. ఈ పథకాన్ని మహా అంటే మూడో తేదీ వరకు ఆపుతారని, ఆ తర్వాత రుణమాఫీ వర్తింపు తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ పునర్జీవం పథకంతో వరద కాలువలు నింపామని, కొత్త సబ్‌స్టేషన్ నిర్మించడంతో బోదేపల్లిలో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. పునర్జీవంతో పోచంపాడ్‌లో నీటికి ఢోకా లేదని స్పష్టం చేశారు. చిట్టాపూర్‌లో ప్రజలు అడిగినవి, అడగనివి అన్నీ చేసి పెట్టానని, తనను మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

