ప్రధాని కుర్చీ మీ అబ్బ జాగీరా?
‘దేశంలో రైతు సర్కారు రావాలని సీఎం కేసీఆర్ అం టుంటే.. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని అమిత్‌షా అంటుండు.. ప్రధాని కుర్చీ ఏమైనా మీ అబ్బ జాగీరా? రైతుబిడ్డ ప్రధాని కాకూడదా?’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అబ్ కి బార్.. కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినదిస్తుంటే, కుర్చీ ఖాళీగా లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు.
- రైతు సర్కార్ రావాలని కేసీఆర్ అంటే కుర్చీ ఖాళీగా లేదంటారా?
- రైతు ప్రధాని కాకూడదా?
- అదానీ, అంబానీల బ్రోకర్లకు దేశాన్ని పాలించే హక్కు లేదు
- అమిత్‌షాపై మంత్రి వేముల ఫైర్
కమ్మర్పల్లి. ఏప్రిల్ 25: ‘దేశంలో రైతు సర్కారు రావాలని సీఎం కేసీఆర్ అం టుంటే.. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని అమిత్‌షా అంటుండు.. ప్రధాని కుర్చీ ఏమైనా మీ అబ్బ జాగీరా? రైతుబిడ్డ ప్రధాని కాకూడదా?’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అబ్ కి బార్.. కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినదిస్తుంటే, కుర్చీ ఖాళీగా లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మంగళవారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్తున్న మాటలను దేశమంతా సానుకూలంగా ఆలోచిస్తుంటే, అమిత్‌షా ప్రధాని కుర్చీ గురించి మాట్లాడమేమిటని నిలదీశారు.
దేశానికి రైతు సర్కార్ కావాలని కోరుకునే కేసీఆర్.. ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. అదానీ, అంబానీల బ్రోకర్లు ప్రధాని అయితే లేని తప్పు.. దేశంలో రైతు శ్రేయస్సు కోరే కేసీఆర్ ప్రధాని అయితే తప్పా? అని ప్రశ్నించారు. ప్రధానిగా అన్ని అర్హతలు ఉన్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. ‘ఎన్నికల్లో ప్రజలు హేమాహేమీలనే అవతల విసిరి పారేశారు. నరేంద్రమోదీ ఓ లెక్కనా? మీ కండ కావరం, అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయలుదేరడంతో ఢిల్లీ పీఠం కదులుతున్నది’ అని పేర్కొన్నారు. మోదీ, అమిత్‌షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని, మహారాష్ట్రలో రైతులోకం కేసీఆర్ కోసం కదిలిందని చెప్పారు. మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన కూతురు కవితను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. టైగర్ కేసీఆర్, టైగర్ బిడ్డ కవిత భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

