చౌటుప్పల్ రూరల్: తెలంగాణ ఉద్యమం లో 18 ఏండ్ల్లు పనిచేసిన ఉద్యమకారుడికి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయి బీజేపీలో చేరిన వ్యక్తికి జరుగుతున్న పోరే మునుగోడు ఉప ఎన్నిక అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చండూరు మండలం డీ నాగారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. రాజగోపాల్ గెలిచినప్పటి నుంచి ఈ ప్రాంతా న్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఆయనకు ఓటేసినా చేసేది ఏమీ ఉండదన్నా రు. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీజేపీ ఓటు వేస్తే బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెడుతుందని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై ప్రతి నెలా 3 నుంచి 5 వేల భారం పడుతున్నదన్నారు. కూసుకుంట్లను గెలిపిస్తే కొయ్యలగూడెం నుంచి డీ నాగారం వరకు రోడ్డు పనులు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిడ్డంగులశాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బూడిద దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.