హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రొయ్య పిల్లల పంపిణీ టెండర్లను అనర్హులకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియపై మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. టెక్నికల్ టెండర్ల బిడ్ విషయంలో మరోసారి ప్రత్యక్షంగా కమిషనర్‌తో తనిఖీలు చేయించాలని మంత్రి భావిస్తున్నట్టు తెలియవచ్చింది.
అప్పటివరకు టెండర్ల ప్రక్రియను పకన పెట్టాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. టెండర్ల పక్రియలో ఓ కీలక నాయకుడు అధికారులు, హేచరీలతో కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో దానిపై వాకాటి శ్రీహరి ఆరా తీయడంతో సంబంధిత అధికారుల్లో వణుకు మొదలైందని చర్చ జరుగుతున్నది.