హైదరాబాద్, నవంబర్23 (నమ స్తే తెలంగాణ): మంథని నియోజకవర్గ పరిధిలో 45 వేల ఎకరాలకు సా గునీటిని అందించేందుకు చేపట్టిన చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లలో పూర్తిచేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై జలసౌధలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి ఉత్తమ్ శనివా రం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల పూర్తికి రూ.571.57 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. సమావేశంలో ఈఎన్సీ అనిల్‌కుమార్, చీఫ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.