Devadula Project | హైదరాబాద్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): దేవాదుల ప్రాజెక్టును సోనియాగాంధీ చేత ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్ వేదికగా ప్రకటించడంపై ఇరిగేషన్ నిపుణులు, తెలంగాణవాదులు నవ్వుకుంటున్నారు. దేవాదుల ప్రాజెక్టును ఎన్నిసార్లు ప్రారంభిస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నా రు. ఈ పథకానికి కాంగ్రెస్ శిలాఫలకం వేసిం ది తప్ప ఏనాడూ నీళ్లివ్వలేదని, ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తామని ఎందుకు ప్రగల్బాలు పలుకుతున్నారని ప్రశ్నిస్తున్నారు. గోదావరి తలాపునే ఉన్నా గొంతు తడవని దుస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాది. ఉద్యమ నేత కేసీఆర్ గులా బీ జెండా ఎత్తి పిడికిలి బిగించిన అనంతరం నాటి సీఎం చంద్రబాబు ‘జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల’ పథకాన్ని 2001లో తెరమీదికి తెచ్చారు. హడావుడిగా 2003లో శిలాఫలకం వేశారు.
కానీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘మొదటిదశ’ పనులు పూర్తిచేయకుండానే 2, 3వ దశ పనులను తెరమీదికి తెచ్చింది. 2007లోనే పథకాన్ని పూర్తిచేయాలి లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటిదశ పనులన్నీ పూర్తయ్యాయని చెప్పి 2008లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా గంగారం ఇన్‌టేక్ పాయింట్ వద్ద అట్టహాసంగా ప్రారంభింపజేసింది. 2012 నాటికి దేవాదుల మొదటిదశ ఎత్తిపోతలు ప్రారంభమైనా ఎనాడూ పూర్తిస్థాయిలో నీరిచ్చింది లేదు. ఇక 2, 3వ దశ పనులకు అతీగతి లేదు. కానీ ఇప్పుడు మళ్లీ దేవాదుల పథకాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని తాజాగా మంత్రి ఉత్తమ్‌కుమార్ ప్రకటించడంపై రాజకీయ ప్రముఖులు, నీటిపారుదల రంగ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
సమ్మక్కసాగర్తోనే దేవాదులకు జీవం..
దేవాదులనుంచి ఏటా 38.18 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్ర ణాళిక రూపొందించింది. వరంగల్‌కు తా గునీటికి 2.84టీఎంసీలు కేటాయించిం ది. మిగిలిన 35.34 టీఎంసీలను సాగు కు వినియోగించాలని నిర్ణయించింది. టీఎంసీ నీటితో 15,360 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించింది. దేవాదుల ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై పూర్తి గా సమీక్షించారు. 267 రోజుల పాటు నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును తీర్చిదిద్దిన కేసీఆర్, గతంలోనే ఉమ్మడి వరంగల్ సాగు, తాగునీటి అవసరాలకు అంకితం చేశారు.