హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌లను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం సందర్శించనున్నారు. తొలుత సుం దిల్ల, అన్నారం బరాజ్‌లను పరిశీలించి అనంతరం మేడిగడ్డ బరాజ్‌ను విజిట్ చేయనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫారసుల మేరకు 3 బరాజ్‌ల రక్షణకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణ ఏజెన్సీలు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్, నాగేందర్రావు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించనున్నారు.