హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేరొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని తెలిపారు. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్లో 24 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వరకు 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.