హైదరాబాద్ : న్యూఢిల్లీలో(New delhi) జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సుకు (International Water Week conference) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హాజరయ్యారు. మంగళవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు- 2024 లో పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సు నేటి నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు పలు దేశాల, పలు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, నీటి పారుదల రంగ నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం జల వనరుల నిర్వహణలో చేస్తున్న కృషిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి జల సంబంధిత ఆవిష్కరణలు, ప్రాజెక్టుల ప్రదర్శన కూడా జరిగింది.