హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): వానకాలానికి సంబంధించి 70.82 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్టు సివిల్ సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గతంలో కొనుగోలు చెసిన 70.26 లక్షల టన్నుల రికార్డ్‌ను ఈ వానకాలంలో అధిగమించినట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఈ కొనుగోళ్లు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల టన్నుల్లో 32.45 లక్షల టన్నులు దొడ్డురకం కాగా, 38.37 లక్షల టన్నులు సన్నరకం అని, కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ. 16,912 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 16,602 కోట్లు చెల్లించినట్టు వివరించారు. సన్నాల బోనస్ కింద రైతులకు రూ.1,425 కోట్లు చెల్లించినట్టు తెలిపారు.