హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్తపేట, సనత్‌నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్ హెల్త్‌సిటీ భవన నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్ల్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయా నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండటంపై మంత్రి దామోదర అసంతృప్తి వ్యక్తంచేశారు. వర్షకాలం మొదలయ్యేలోగా నిర్మాణ పనులన్నీ కొలికి రావాలని అధికారులను ఆదేశించారు.