హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ పంటను ప్రోత్సహించేందుకు కనీస ధర టన్నుకు రూ.15 వేలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.13,438గా ఉందని తెలిపారు.
వయబులిటీ ధర నిర్ణయించేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం అధిక నూనె శాతం వచ్చే తెలంగాణను పరిగణలోకి తీసుకోకుండా తక్కువ నూనె శాతం వచ్చే ఏపీని పరిగణలోకి తీసుకున్నదని ఆరోపించారు.