రైతు భరోసా రబీ నుంచి అని చెప్పానుగా. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చే యాసంగికి ఇస్తాం. వానకాలం రైతు భరోసా లేదు. హామీ ఇచ్చిన ట్టుగా ఎకరానికి రూ.7500 చొప్పున.. పంట వేసిన రైతులకు మాత్రమే ఇస్తాం.
– ప్రెస్మీట్లో తుమ్మల
Rythu Bandhu | హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానకాలం సీజన్‌కు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చే పంట కాలానికి అంటే యాసంగికి పెట్టుబడి సాయం ఇస్తామని తేల్చిచెప్పారు. శనివారం బీఆర్కే భవన్లో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వానకాలం పెట్టుబడి సాయం ఇవ్వనట్లేనా ? అని విలేకరులు ప్రశ్నించగా… ‘రబీ నుంచి అని చెప్పానుగా.. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చే పంట కాలానికి అంటే రబీ(యాసంగి)కి ఇస్తాం’ అని తెలిపారు. వెంటనే మరి ఈసారి అని విలేకరి ప్రశ్నించగా.. ‘ఇది లేదు’ అని మంత్రి తుమ్మల స్పష్టతనిచ్చారు. డిప్యూటీ సీఎం నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్రాగానే, డిసెంబర్లో రుణమాఫీ పూర్తి కాగానే రైతుభరోసా ఇస్తామని తెలిపారు. తమ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఎకరానికి రూ. 7500 చొప్పున.. పంట వేసిన రైతులకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు.
2 లక్షలపై రుణమాఫీ డిసెంబర్ తర్వాతే…
రాష్ర్టానికి ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా రుణమాఫీ భారాన్ని భు జాన వేసుకున్నామని మంత్రి తుమ్మ ల తెలిపారు. తాము ఇచ్చిన హామీ ప్ర కారం 2022 నవంబర్ నుంచి మాత్ర మే రుణాలను మాఫీ చేయాలని, కానీ రైతులకు అన్యాయం జరగొద్దని ఐదేం డ్లు తీసుకున్నట్టు తెలిపారు. తమ లెక్క ప్రకారం రుణమాఫీ అర్హులు 42 లక్షల ఖాతాలు ఉండగా 25 లక్షల మంది కు టుంబాలని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసినట్టు తెలిపారు.
రుణమాఫీ వివరాలతో ని యోజకవర్గాల వారిగా బుక్ తయారీ చేసినట్టు తెలిపారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు. రూ. 2 లక్షలలోపు రుణమాఫీ కాని తెల్లకార్డులేని రైతుల కుటుంబ నిర్ధారణ చేయగా 3లక్షల కుటుంబాల లెక్క తేలిందని చెప్పారు.
వీరికి డిసెంబర్ లోపు రుణమాఫీ చేస్తామని చెప్పా రు. 2 లక్షలకుపైగా రుణ రైతులకు ఆ తర్వాత క్యాబినెట్లోచర్చించి షెడ్యూ ల్ ప్రకటిస్తామని తెలిపారు. నెలల వా రీగా, వాయిదాల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతులు 2 లక్షలకు పైగా రుణం చెల్లించిన వెంటనే వారి ఖాతాల్లో రూ. 2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. రుణమాఫీ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని విలేకరులు ప్రశ్నించగా… మంత్రి నుం చి స్పష్టమైన సమాధానం కరువైంది.