హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మలేషియా పర్యటన కొనసాగుతున్నది. గురువారం రెండోరోజూ పహాంగ్ రాష్ట్రం జెరంటుట్లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్, ఆర్ అండ్ డీ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆయిల్‌పామ్ సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అలాగే కుయంటన్ పోర్ట్‌లో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను సందర్శించారు. ఆయన వెంట రాష్ట్ర హార్టికల్చర్ అధికారులు ఉన్నారు.