ఖమ్మం : పామాయిల్ సాగుతో( Palm oil cultivation) అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారన్నారు.
వాతావరణ పరిస్థిల దృష్ట్యా ఈసారి పత్తి దిగుబడి తగ్గిందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో 17 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు.. సుప్రీంకోర్టు వద్ద దాసోజు శ్రవణ్
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్