ఖమ్మం : రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్( Mirchi market)లో అవకతవకలపై మార్కెట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్ట కొడితే సహించేది లేదని హెచ్చరించారు. ఖమ్మం మార్కెట్ యార్డుకు కార్యదర్శులను నియమిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామని మంత్రి తెలిపారు.