ప్రజా ప్రభుత్వాలు మోదీకి ఇష్టం లేదు
- మధ్యప్రదేశ్ తరహాలో మహారాష్ట్రలోనూ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: మంత్రి తలసాని
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగటం ప్రధాని మోదీకి ఇష్టంలేదని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశం సర్వనాశనం కావాలని బీజేపీ కోరుకొంటున్నదని.. ఇలాంటి పరిణామాలు ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.
మోదీ, అమిత్‌షాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్‌లో చేసిన విధంగానే మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ఈ కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలను ఒక చోటునుంచి మరో చోటుకు తరలిస్తున్నదని పేర్కొన్నారు. అధికారమనేది జీవితకాలం కొనసాగదన్న వాస్తవాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవని.. మహారాష్ట్రలో ఇవాళ సృష్టించిన సంక్షోభాన్ని భవిష్యత్తులో బీజేపీకీ ఎదురవుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ సమావేశాలకు వచ్చే బీజేపీ ముఖ్యమంత్రులకు, నేతలకు ఇక్కడి అందాలు, జరుగుతున్న ప్రగతిని చూసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే బీజేపీ నేతలు ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

