Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న వ్యవసాయానికి ఉచిత 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సాయం, రైతుబీమా తదితర పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఏమీ లేవని చెప్పారు. తమకు తెలంగాణ తరహాలో అందిస్తున్న రైతు పథకాలు కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని చెప్పారు.