హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తిరిగి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు.
ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్నా కార్యకర్తలే పునాది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కు చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో గౌరవంగా, తలెత్తుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమలు చేస్తున్నదని చెప్పారు.