మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, వరాహ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పట్టు వస్త్రాలతో సత్కరించారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ తదితరులున్నారు.