Minister Srinivas Goud | ఎన్నికల ముందు విభజన హామీలు నెరవేరుస్తారని ప్రజలంతా ఆశించారని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్ర ఏంటీ..? విశ్వాస ఘాతకుడు మోదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్వానీలాంటి నాయకున్ని అణగదొక్కిన చరిత్ర మోదీదని, కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా.. ఓ చిన్న రిపేర్ కంపెనీ పెట్టారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని, ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు మోసం చేశారన్నారు. దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నింటికీ తెలంగాణే కేంద్ర బిందువన్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి చేసిందని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. 80కోట్ల బీసీలు మోదీ ప్రధాని అయితే సంతోషపడ్డారని, కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం మోదీదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.