మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నేడు దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చారని కొనియాడారు. అందరికీ ఉద్యోగాలు, ఉపాధి, ప్రతి ఎకరాకూ సాగు నీరు, తాగేందుకు మంచినీరు అందజేస్తామన్నారు. పక్క రాష్ర్టాల వాళ్లు కూడా పాలమూరుకు వచ్చేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.