మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్(Brs)లో చేరుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas goud) అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం పోతనపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో సంతోష్, వెంకట్రాములు, చిన్న నరసింహులు, నర్సింలు, కృష్ణయ్య, అంజి, శివ, చిలుక నరసింహులు, ఆంజనేయులు, చెన్నప్ప, వందమంది యూత్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఆంజనేయులు, మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, పాండురంగారెడ్డి, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఖాదర్, వెంకటేశ్ పాల్గొన్నారు.