హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్లకు మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అధికారులు ఆదేశించారు. అందరికీ అవకాశాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్‌గా ఏర్పడినా, దరఖాస్తులకు అడ్డంకులు సృష్టించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించేవారిపై గట్టి నిఘా పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనూ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
సెల్ఫ్ అఫిడవిట్‌ను పరిశీలించండి
తకువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతామని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఎకడైతే తకువ దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించాలని కోరారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వైన్స్ దరఖాస్తులకు కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్ లేకపోతే సెల్ఫ్ అఫిడవిట్లను అంగీకరించాలని ఆదేశించారు. దరఖాస్తులో ఏ సమస్యలు ఉన్నా, స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారులను సంప్రదించాలని, లేదా 1800 425 2523 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తమ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫార్మా, వస్త్ర తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి వారికి మద్యం పాలసీని వివరించాలని సూచించారు. సమీక్షలో ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్, హరికిషన్, సహాయ కమిషనర్లు ఏ చంద్రయ్యగౌడ్, శ్రీనివాస్, ఈఎస్‌లు ఏ సత్యనారాయణ, టీ రవీందర్రావు, అరుణ్‌కుమార్, విజయ భాసర్గౌడ్, విజయ్, పవన్‌కుమార్, టీఎస్‌బీసీఎల్ ఉన్నతాధికారులు సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.