హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈజిప్టు కైరో లో ఇటీవల జరిగిన వరల్డ్ రైఫిల్,పిస్టోల్ చాంపియన్ షిప్ పోటీలో 25 మీటర్ల జూనియర్ విభాగం, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్ లో మూడు పతకాలు సాధించిన ఇషాసింగ్‌ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్న పతకాలు సాధించాలని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఇషా సింగ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.