హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం 8 లోక్‌సభ స్థానాలిచ్చి బీజేపీకి ప్రాణం పోశారని, ఇప్పుడు ప్రజలు ఆపదలో ఉన్నందున వారిని ఆదుకోవాలని కోరారు. వర్షాలకు 14 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, 16 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట, ఆస్తుల నష్టం సంభవించిందని మంత్రి తెలిపారు. వరదల వల్ల రూ.5,500 కోట్ల నష్టం జరుగగా, తక్షణ సాయంగా కేంద్రం రూ.2,000 కోట్లు విడుదల చేయాలని కోరారు.