హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముహుర్తాన అధికారంలోకి వచ్చిందో గాని ప్రజలు నిత్యం కష్టాలను అనుభవిస్తున్నారు. నాలుగు ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయగా అవి యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. అవినీతి,బంధుప్రీతి, లంచాలు తీసుకుంటూ అనర్హులకు సంక్షేమ పథకాలు కట్టబెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) సొంత ఊరిలోనే ప్రజలకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామ సభలో భూమి ఉన్నవారికి, అనర్హులకు పథకాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. భూమి లేని పేద ప్రజలకు, అర్హులకు పథకాలు రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను గుర్తించి ఎంపిక చేయాలని అధికారులను చుట్టుముట్టారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ సొంత గ్రామం ధన్వాడలో పేదలకు, అర్హులకు పథకాలు ఇవ్వడం లేదని గామస్తుల ఆగ్రహం
మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామ సభలో భూమి ఉన్నవారికి, అనర్హులకు పథకాలు వస్తున్నాయని, భూమి లేని పేద ప్రజలకు, అర్హులకు పథకాలు రావడం లేదని అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం… https://t.co/0sQ2Ub13cI pic.twitter.com/4edcf8mvUB
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025