హైదరాబాద్ : ఆమె ఓ బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న మంత్రి. సమస్యలు పరిష్కరించాలని ఎవరు వెళ్లినా పని చేయాల్సిన బాధ్యత తనది. కానీ, తనే స్వయంగా సమస్యను ఎదుర్కొని కూడా స్పందించ కపోవడం పట్ల నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్(Asifabad) మండలం గుండి గ్రామంలో స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క(Minister Seethakka) వెళ్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వాగు దాటాల్సి వచ్చింది. మంత్రి సీతక్క వాగు దాటుతూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. వాగు దాటింది కానీ వంతెన నిర్మాణంపై మాత్రం మంత్రి సీతక్క ఏం మాట్లాడలేదని స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను స్వయంగా మంత్రే చూశాక కూడా కనీసం స్పందించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రి వాగు దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వాగులో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన మంత్రి సీతక్క
వాగుపై నిర్మించాల్సిన బ్రిడ్జిపై మాత్రం సప్పుడు లేదు
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ వాగు దాటిన మంత్రి సీతక్క.
వాగు దాటుతూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చిన సీతక్క.. వాగు దాటింది కానీ వంతెన నిర్మాణంపై మంత్రి… pic.twitter.com/kRnB2GgvtN
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2024