రవీంద్రభారతి, జనవరి 3: సావిత్రీబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో సావిత్రీబాయి ఫూలే 194వ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ మణిమంజరి అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ పూలే విగ్రహాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఆశయాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఫూలే జయంతి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు.