హైదరాబాద్: దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. స్త్రీలకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డామని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాదని సావిత్రీ బాయి ఫూలే నిరూపించారని వెల్లడించారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రీ బాయి ఫూలే అన్నారు. ఆదివాసీ బిడ్డ రాష్టప్రతిగా ఉన్నారని తెలిపారు.
భార్యాభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలని ప్రశ్నించారు. భార్యాభర్తలు ఇద్దరూ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు లోన్బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారుచేయాలని సూచించారు. ఫిష్ఫుడ్కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని, 100 శాతం సక్సెస్ రేట్ ఉండాలన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలని తెలిపారు. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలన్నారు. మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెల్లాలని ఆకాంక్షించారు.
అంతకుముందు సావిత్రీబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తున్నందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇది మహిళలందరికి గర్వకారణమని చెప్పారు. సావిత్రీబాయిని స్పూర్తిగా తీసుకుని మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Hearty thanks to our CM Revanth Reddy garu for declaring the birth anniversary of the country’s first female teacher, Savitribai Phule garu, as Women’s Teachers’ Day.
A proud moment for all women! With her inspiration, our people’s government is committed to empowering women! pic.twitter.com/y6xb8ivlVI— Danasari Seethakka (@seethakkaMLA) January 3, 2025