హైదరాబాద్ మే 15 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లల్లో అన్ని వసతులు కల్పించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆ దేశించారు. గురువారం వివిధ జిల్లాల సంక్షేమశాఖ అధికారులు(డీడబ్ల్యూవో)లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి ఆరేండ్లలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో చేర్పించాలని ఆమె సూచించారు.
‘అమ్మమాట అంగన్వాడీ బాట’ అనే నినాదంతో అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సరైన సౌకర్యాలు లేని భవనాలను సమీపంలోని పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆమె పేర్కొన్నారు. తాగునీటి, టాయ్లెట్ సౌకర్యాలు లేనిచోట్ల వెంటనే చర్యలు వసతులు కల్పించాలని తెలిపారు. 85 అంగన్వాడీ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మించాలని సంకల్పించామని సీతక్క పేర్కొన్నారు.