హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
ములుగు అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై పీసీసీఎఫ్, డీఎఫ్వో, స్థానిక అటవీ అధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని, తిరిగి చెట్లు పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.