హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): అంగన్వాడీ సెల్ఫోన్ల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మంత్రి తరఫున న్యాయవాది నాగులూరి కృష్ణకుమార్ ద్వారా రిజిస్టర్ పోస్టులో పంపారు. అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లలో గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న క్రమంలో మంత్రి సీతక్క ఈ నోటీసులు పంపారు.