హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో బీసీ బిల్లును తీసుకొచ్చే క్రమంలో అడ్డుపడ్డది రేవంత్ బంధువేని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరోక్షంగా అంగీకరించారు. నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును వ్యతిరేకించి కేసు వేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి బంధువు అయినంత మాత్రాన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అంటగట్టకూడదని పేర్కొన్నారు.
ఆదివారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2018లో సీఎం కేసీఆర్ జీవో 396 తెచ్చి స్థానిక ఎన్నికల్లో బలహీనవర్గాలకు న్యాయం చేయాలని చూస్తే మహబూబ్‌నగర్‌కు చెందిన గోపాల్‌రెడ్డి కోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. గోపాల్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి సన్నిహిత బంధువు అని పేర్కొన్నారు. మంత్రి సీతక్క స్పందిస్తూ బంధుత్వాలను పార్టీ సిద్ధాంతాలకు అంటగట్టొద్దని చెప్పారు.