హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యతపై రాజీపడవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. నాణ్యమైన సరుకులు సరఫరా చేయని సప్లయర్స్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.