Teenmar Mallanna | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పార్టీలో ఉన్న ప్రతిఒక్కరూ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కులగణన ప్రతులను ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కాల్చేయడంపై ఆమె బుధవారం స్పందించారు.
ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్టు చెప్పారు. సర్వేపై అభ్యంతరాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలని హితవు పలికారు. గతంలో నిర్వహించిన అంతర్గత సమావేశాలకు ఆయన కూడా హాజరయ్యారని, అప్పుడు అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఆయన అంశాన్ని పార్టీ చూసుకుంటుందని తెలిపారు.