హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధిలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రుణాలను వెంటనే పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎక్కువ రుణాలు ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ పనితీరుపై మంగళవారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రహదారుల వెంట పండు,్ల కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారులకు షెడ్డులు ఏర్పా టు చేయాలని, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే విధంగా చొరవ చూపాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అవసరాలు గుర్తించేందుకు స్టడీ టూర్ నిర్వహించాలని, మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరేలా చూడాలని సూచించారు.