హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుం చి రెండు యూనియన్లు చేస్తున్న సమ్మెను సామరస్యంగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
మంగళవారం రాష్ట్ర శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, సంబంధిత శాఖ కమిషనర్ హోలీకెరి అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో చర్చలు నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.