Minister Satyavati | ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati | ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు. ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయో వారికి ఓటు వేయాలని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మాల్యాలలో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్తో కలసి ప్రచారంలో పాల్గొన్నారు.
మహబూబాబాద్ : ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు. ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయో వారికి ఓటు వేయాలని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మాల్యాలలో మహబూబాబాద్(Mahabubabad) బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్తో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
శంకర్ నాయక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు సాగు, తాగు నీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు రైతు బీమా సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చే మూడు గంటల విద్యుత్ కావాలా? కేసీఆర్ అందించే 24 గంటల విద్యుత్ కావాలో తేల్చుకోవాల్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, కాంగ్రెస్ ఓటు వేసిన కర్ణాటక ప్రజల పరిస్థితి ఉందన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు 7 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలిందన్నారు. మల్యాలలో హార్టీ కల్చర్ డిగ్రీ కాలేజీని ప్రారం భించుకున్నాం. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలంటే శంకర్ నాయక్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

