హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): మణిపూర్‌లో గిరిజనులపై అత్యంత దుర్మార్గంగా, అమానవీయంగా జరుగుతున్న హింస, దా రుణాలు ప్రధానికి పట్టవా? అని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మణిపూర్‌లో కుకీ గిరిజన తెగపై మూడు నెలలుగా జరుగుతున్న దారుణాలు కలచివేశాయని అన్నా రు. శనివారం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. మణిపూర్ లో దారుణాలు జరుగుతున్నా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా దేశ ప్రధాని నరేంద్రమోదీ లెక్కలేనట్టు వ్యవహరించటం దారుణమని మండిపడ్డారు.
ప్రాయోజిత హింస: కవిత
మణిపూర్ విభజించి పాలించే బ్రి టీష్ విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నదని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మణిపూర్‌లో ప్రభుత్వ ప్రాయోజిత హింస జరుగుతున్నదని ఆరోపించా రు. ‘అన్ని జా తులు బాగుపడాలని మనం కోరుకుంటుంటే విభజించి పాలించి ఓట్లు దండుకోవాలన్న ప్ర యత్నం కేం ద్రంలో కనిపిస్తున్నది’ అని ధ్వజమెత్తారు. ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డకట్టవేయకపోతే ప్రకృతి ప్రకోపిస్తుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మండిపడ్డారు. మణిపూర్ ఘటన దుర్మార్గమైందని, సమాజం ముక్తకంఠంతో ఖండించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. మణిపూర్ గిరిజనులకు న్యా యసేవలు దక్కాలని మరో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.