బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 10:10:54

శ్రీవారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్‌

శ్రీవారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌ : తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ గురువారం దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కుటుంబీకులతో స్వామిని వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజల జీవితాల్లో నూతన కాంతులు ప్రసరించేలా దీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేసి, రైతును రాజు చేయాలన్న సీఎం లక్ష్యం నెరవేరాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మొములో చిరునవ్వు చూడాలన్న ఆశయం సిద్ధించేలా ఆశీర్వదించాలని వేడుకున్నానని చెప్పారు.


logo