భూపాలపల్లి: మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాణహిత పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. గురువారం ఉదయం మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం అందించారు. మంత్రి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమాణారెడ్డి కూడా ఉన్నారు.