Hyderabad | సఖీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్‌గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగగ్లో మంత్రి శంకుస్థాపన చేసిన మాట్లాడారు.

హైదరాబాద్ : మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉందని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు.
మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్‌గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగగ్లో మంత్రి శంకుస్థాపన చేసిన మాట్లాడారు. సఖీ కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వీటిని ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటుందని తెలిపారు.
సఖీ కేంద్రానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి పెద్ద భవనం నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని మంత్రి తెలిపారు. ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అప్పటికప్పుడు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. అక్కడ కూడా త్వరలోనే సొంత భవనాలు నిర్మించి, అందులోకి తరలిస్తాంమని స్పష్టం చేశారు.మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీసుల ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం నడుస్తున్నాయని వివరించారు.
మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా, వారికి న్యాయ పర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా ఈ సఖీ కేంద్రాల ద్వారా పని చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ వాణీ దేవి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, కలెక్టర్ ఎల్. శర్మన్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ పద్మనాభ రావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

