రంగారెడ్డి : జిల్లా పర్యటనలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో TUFIDC ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.