హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించింది. ఈ సందర్భంగా మం త్రులు హరీశ్‌రావు , సబితాఇంద్రారెడ్డికి సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇప్పుడు రెగ్యులరైజేషన్‌తో మాకో భరోసా దొరికింది. మేము ప్రభుత్వ ఉద్యోగులం అయ్యామన్న సంతోషంతో మా కుటుంబాలన్నీ పండుగ చేసుకొంటున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ మల్యాల జూనియర్ కాలేజీ అధ్యాపకుడు కే శ్రీనివాస్, చొప్పదండి జూనియర్ కాలేజీ అధ్యాపకుడు బీ కొండయ్య తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం హర్షం ప్రకటించింది. కేసీఆర్‌కు ఆ సంఘం అధ్యక్షుడు బాలరాజు ధన్యవాదాలు తెలిపారు. వి ద్యుత్తు ఉద్యోగులకు ఆశాజనకమైన పీఆర్సీ ఇవ్వడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసో సియేషన్ (వీఏవోఏటీ ) నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమ వారం వీఏవోఏటీ ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచి వాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలి పింది. మంత్రిని కలిసినవారిలో వీఏవోఏటీ రా ష్ట్ర అధ్యక్షుడు అశోక్, వీరస్వామి, అనిల్, వెంక టేశ్వర్లు, అనురాధ, స్వామి, శ్రీనివాస్, నాగరాజు ఉన్నారు.
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టి జన్లకు ఇంటి అద్దె భత్యాన్ని సవరిస్తూ టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవా రం ఉత్తర్వులిచ్చారు. విద్యుత్తు ఉద్యోగుల తో పాటు ఆర్టిజన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
విద్యుత్తు ఉద్యోగులకు ఆశాజనకమైన పీఆర్సీ ఇవ్వడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ ) నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం వీఏవోఏటీ ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో వీఏవోఏటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, వీరస్వామి, అనిల్, వెంకటేశ్వర్లు, అనురాధ, స్వామి, శ్రీనివాస్, నాగరాజు తదితరులున్నారు.