Telangana | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండున్నర ఏండ్లకు నర్సరీలో పాఠశాలలో చేరిన విద్యార్థులు దాదాపు 20 ఏండ్ల తర్వాత విద్యను పూర్తిచేసుకొని సమగ్రమైన వ్యక్తిగా సమాజంలో అడుగుపెట్టేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కురిక్యులాన్ని రూపొందించింది. నర్సరీ టు కేజీ విద్యార్థులకు ఎదుటివారి భావోద్వేగాలపై అవగాహన కల్పిస్తారు.
ఒకటి రెండు తరగతుల్లో శరీరతత్వం, ఇష్టాయిష్టాలు, కొత్త నైపుణ్యాల గురించి నేర్పిస్తారు. ఇలా ఒక్కో తరగతిలో సహ విద్యార్థులు, టీచర్లు, తోబుట్టువులు, సమాజంలో వివిధ వర్గాల అభిప్రాయాలను అర్థంచేసుకోవడంతోపాటు అవగాహన కల్పిస్తారు. అన్ని భావోద్వేగాలను నియంత్రించుకొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. వ్యాపార ఆవిష్కరణల దిశగా ఆలోచనలను మళ్లిస్తారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవసరమైన నైపుణ్యం కల్పిస్తారు. విద్యార్థి దశలోనే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా మానసికంగా సంసిద్ధులుగా ఉండేందుకు హ్యాపీనెస్ కరిక్యులం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
Child
ఈ ఏడాది నుంచే అమలు
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఢిల్లీ తరహా ‘హ్యాపినెస్ కరిక్యులం’ను అమలు చేస్తామని మంత్రి సబిత చెప్పారు. విద్యార్థులలో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం కలుగజేయడం, సామాజికభావోద్వేగ నైపుణ్యాల పెంపునకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7 తరగతుల్లోని విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్తు పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
బిజినెస్ ఇన్నోవేటర్స్
విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలవైపు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మొదటి దశలో 8 జిల్లాలోని 24 మాడల్ సూళ్లను ఎంపిక చేసి, అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిషరణల పట్ల ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. ఇందులో మెరుగైన 1500 ఆవిషరణలను ప్రోత్సహించి.. ఒకో ఆవిషరణకు రెండు వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. వీరిని భవిష్యత్తులో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని మంత్రి వివరించారు.