Minister Sabitha | జరిగిన అభివృద్ధిని.. సీఎం కేసీఆర్‌ను గుర్తుచేసుకోని ఓటెయ్యాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha | దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ(BRS) మారిందని, సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం(Maheshwaram) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి(Minister Sabitha) అన్నారు.
రంగారెడ్డి : దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ(BRS) మారిందని, సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం(Maheshwaram) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి(Minister Sabitha) అన్నారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని..సీఎం కేసీఆర్‌ను గుర్తుచేసుకోని.. వెళ్లి ఓటెయ్యాలని కోరారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహేశ్వర నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్నారు.
అలాగే పెరిగిన నిత్యావసర ధరలు.. గ్యాస్ సిలిండర్ పై పెరిగిన ధరలను గుర్తుచేసుకొని ఓటేయ్యాలని సూచించారు. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీలో తోపాటు నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు డ్రైనేజీ, రోడ్ల సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం జరగనంత అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల జరిగిందన్నారు. తాను నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాను. మరోసారి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

