బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 21:37:49

బాధితులను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బాధితులను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి


వికారాబాద్‌ :  వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి, నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామాల్లో  కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన  బాధితులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి మంత్రి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి అదుపులో వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు ఉదయం నుంచి గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. 12 గ్రామాలకు చెందిన సుమారు 100 మంది ఉదయం నుంచి ఒకే రకమైన లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo